కార్తీకమాసం ముగిసి, మార్గశిర మాసం ప్రవేశిస్తున్న సందర్భంగా సోమవారం పోలి పాడ్యమిని మహిళలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. సోమవారం తెల్లవారుజామున పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో, గొల్లప్రోలు పట్టణంలో ఉమారామలింగేశ్వరుని ఆలయానికి వేకువజామున రెండు గంటల నుంచే భక్తుల రాక మొదలైంది. అరటి డొప్పలపై చమురు దీపాలు వెలిగించి, తమ ఇష్ట దైవాలను తలచుకుంటూ నీటిలో వదిలారు.