పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ ను కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేసి ముఖ్యమైన రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసులపై ఆరా తీశారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచి, ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించి, విసిబుల్ పోలీసింగ్ పెంచాలని ఆదేశించారు.