పిఠాపురం ప్రజల నుంచి 556 అర్జీలు స్వీకరించిన కలెక్టర్

67చూసినవారు
పిఠాపురం పట్టణంలోని రథాలపేట వద్ద ఉన్న అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కాకినాడ కలెక్టర్ షన్మోహన్ సోమవారం నిర్వహించారు. జూలై 1 న డిప్యూటీ సీఎం పవన్ కు ఇచ్చిన మాట ప్రకారం పిఠాపురంలో డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకోగా 556 అర్జీలు తమకు అందాయని కలెక్టర్ తెలియజేశారు. వాటిని సకాలంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్