గొల్లప్రోలు: పంట నష్టంపై అధికారులు సర్వే నిర్వహించాలి
పిఠాపురం మాజీ ఎమ్మేల్యే వర్మ గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో శనివారం పర్యటించి పత్తి, మిరప చేలును పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గాడ, చేబ్రోలు, తాటిపర్తి గ్రామాలలో పత్తి చేలు వైరస్ సోకి మొత్తం పాడైపోవడం జరిగిందని తెలిపారు. దుర్గాడ గ్రామంలో విత్తనాలు నాసిరకం వలన మిరప చేలు సుమారుగా 300 ఎకరాల్లో రైతులు నష్టపోతున్నారని, అధికారులు పంట నష్టంపై సర్వే నిర్వహించాలని కోరారు.