

పిఠాపురం: వెలవెల బోయిన చికెన్ దుకాణాలు
మాంసం ప్రియులు ఆదివారం వచ్చిందంటే చికెన్ మటన్ షాపుల వద్ద బారులు తీరుతుంటారు. బర్డ్స్ ఫ్లూ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. 100 కేజీల విక్రయించే దుకాణదారుడు కనీసం 5కేజీలు కూడా అమ్మలేకపోతున్నారు. మాంసం ప్రియులందరూ చేపలపై మక్కువ చూపిస్తున్నారు. ఒక్కసారిగా అందరూ చేపలు కొనుగోలు చేయడంతో చేపలకు మంచి గిరాకీ ఏర్పడింది. చేపలను అధిక రేటుకి అమ్మకాలు సాగిస్తున్నారు.