రౌతులపూడి మండలం ములగపూడి కోదండ రామస్వామి సన్నిధిలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా అఖండ హారతి, అఖండ జ్యోతి కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ కోదండరామ మహిళా సేవా సమైక్య సభ్యులు వ్యాస పూర్ణిమ, గురుపూర్ణిమ విశిష్టతను భక్తులకు వివరించారు. స్వామివారి పాటలు పాడుతూ భజనలు చేశారు. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.