ఏలేశ్వరం సబ్ స్టేషన్ పరిధిలో ఫీడర్ మరమ్మత్తుల నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరానిలిపి వేస్తున్నామని ఎఈ రత్నాలరావు తెలిపారు. శనివారం ఉదయం 9 గంటలు నుంచి 12 గంటల వరకు నర్సీపట్నం రోడ్, లింగంపర్తి రోడ్, కాలేజీ రోడ్, తోటవీధి, మార్కెట్ వీధి, శివాలయం వీధి, వాగువారి వీధి, హై స్కూల్ వీధి, షిర్డీ నగర్, భద్రవరం, సి. రాయవరం, జి. వి. పాలెం, ఇ. ఎల్. పురం, జె. అన్నవరం తదితర ప్రాంతాలలో సరఫరా ఉండదన్నారు.