వీధులలో చెత్తను తొలగించే కార్యక్రమం చేపట్టిన జనసైనికులు

9344చూసినవారు
వీధులలో చెత్తను తొలగించే కార్యక్రమం చేపట్టిన జనసైనికులు
కర్లింపూడి: గెలుపు ఓటములతో పనిలేదని ఎల్లప్పుడు ప్రజలతోనే మమేకమై వారికి తోడునీడగా ఉంటామని జనసేన నాయకుడు పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. జనసేన పార్టీ నాయకుడు పార్టీ ఆవిర్భావం నుంచి మార్పు కోసమే ప్రజలలోకి వచ్చారని జయాపజయాలతో సంబంధం లేదన్నారు. శ్రుంగరాయణపాలెంలో జనసైనికులతో కలసి గ్రామంలో అన్ని వీధులలో చెత్తను తొలగించే కార్యక్రమం చేపట్టారు. అలాగే కూరుకుపోయిన మురికి కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టారు. జనసేన పార్టీ నాయకులైన కార్యకర్తలైన ప్రజలకు సేవ చేసేందుకే వారు ముందుంటారని ప్రజా ప్రతినిధులుగా ఎంపికైనా కాకపోయినా ప్రజలతో మమేకమై ఉంటానని ఆయనన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్