వాలంటీర్లు ప్రజలకు అవగాహన కల్పించాలి.జూనియర్ సివిల్ జడ్జ్ కాటం భాను

1796చూసినవారు
వాలంటీర్లు ప్రజలకు అవగాహన కల్పించాలి.జూనియర్ సివిల్ జడ్జ్ కాటం భాను
పారా లీగల్ వాలంటీర్లుగా ఎంపికైన వారికి శిక్షణ తరగతులను ప్రత్తిపాడు కోర్టు పరిధిలో నిర్వహించారు. ఈ తరగతులను జూనియర్ సివిల్ జడ్జ్ మరియు మండల లీగల్ సెల్ చైర్మన్ కాటం భాను శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు గ్రామాల్లో ప్రజలకు మండల న్యాయాధికారి సేవల పై అవగాహన కల్పించాలని తెలిపారు. సామాన్య ప్రజలకు న్యాయ సేవల పై అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికీ న్యాయ సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సి. పుల్లయ్య, ప్యానల్ న్యాయవాది, మల్లేశ్వర రావు , శ్రీలక్ష్మి, న్యాయవాదులు గౌరీ శంకర్, రాయి శ్రీనివాస్, అశోక్ కుమార్ పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్