రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ ట్రస్ట్ భవనాన్ని ఈ నెల 8న ప్రారంభించనున్నట్లు ఛాంబర్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, గౌరవ కార్యదర్శి మురళీకృష్ణ తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలో వారు మీడియాతో మాట్లాడుతూ రూ. 2 కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ భవన ప్రారంభోత్సవానికి మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురందీశ్వరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య తదితరులు పాల్గొంటారన్నారు.