తూ. గో జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను ఈ నెల 29 నుంచి వచ్చే నెల 1 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నెల 29న తిరుపతి-విశాఖపట్నం డబుల్ డెక్కర్, 30న విశాఖపట్నం-తిరుపతి డబుల్ డెక్కర్, విజయవాడ-విశాఖపట్నం-విజయవాడ రత్నాచల్, విశాఖపట్నం - గుంటూరు - విశాఖపట్నం ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.