తూ. గో జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'లో 36 అర్జీలను స్వీకరించారు. సోమవారం జిల్లా అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యల గురించి, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు, ఇతర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు. వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు.