జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం -2025 కార్యక్రమంలో భాగంగా గురువారం రాజమండ్రిలో ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.