రాజమండ్రి నగరపాలక సంస్థలో అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు అగ్రిమెంట్లో కాలవ్యవధి ప్రకారం పనులు పూర్తి చేయాలని, నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా ఉండాలని కమిషనర్ కేతన్ గార్గ్ పిలుపునిచ్చారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగు అధికారులు, కాంట్రాక్టర్లతో కమిషనర్ బుధవారం సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ సకాలంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.