రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి మంగళవారం సాయంత్రానికి 2, 92, 172 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 9. 70 అడుగులకు చేరిందన్నారు. అలాగే డెల్టా కాలువలకు 11, 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు వివరించారు.