సమాజంలో మేకవన్నే పులులున్నాయని వారి పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని కడియం సీఐ ఏ. వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం కడియం మండలం బుర్రిలంకలో కడియం సిఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నర్సరీలలో పనులకు వెళ్లే మహిళలకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పనులకు రాకపోకలు సాగించే క్రమంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా కాకుండా అందరూ కలిసి వెళ్లాలని సూచించారు.