ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రాక్టర్లు ద్వారా ఉచితంగా ఇసుక తవ్వుకునే అవకాశం ఇటీవల ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కడియం మండలంలోని బుర్రిలంక ఇసుక ర్యాంపు వద్ద సోమవారం సందడి వాతావరం నెలకొంది. ఇసుకను తోలుకునేందుకు వందల సంఖ్యలో ర్యాంపుకు ట్రాక్టర్లు చేరుకున్నాయి. మరోపక్క ముఖ్యమంత్రి ప్రకటన పట్ల ట్రాక్టర్ల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.