కడియం మండలం కడియపులంక హరిహర మహాక్షేత్రంలో ఉన్న శ్రీసాయిబాబా ఆలయంలో కార్తీకమాసం రెండవ గురువారం సందర్భంగా ప్రత్యేకపూజలు చేశారు. ఆలయాన్ని వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. బాబా దర్శనానికి ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. హరిహర క్షేత్రం చైర్మన్ మార్గాని సత్యనారాయణ, లక్ష్మి దంపతులు బొర్రా వీర్రాజు భూలక్ష్మి దంపతులు పీటలపై కూర్చుని సాయినాధునికిసాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.