రాజమండ్రి: బీసీలను అన్యాయం చేశారు

81చూసినవారు
కూటమి ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గానికి చేసిందేమీ లేదని వైసీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, బీసీ వెల్ఫేర్ మాజీ మంత్రి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శనివారం బొమ్మూరు పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. బీసీలకు ఆరాధ్యదైవమైన జ్యోతిరావు పూలే ఆశయాలను తుంగలో తొక్కారని అన్నారు. నిన్న ఏలూరులో ముఖ్యమంత్రి మాట్లాడిన టీడీపీ పార్టీ బీసీలకు ఎప్పుడు అండగా ఉంటుందన్న మాటలు అవాస్తవాలు అని విమర్శలు చేశారు.

సంబంధిత పోస్ట్