భారత రాజ్యాంగం గొప్పదనం, విశిష్టత ప్రతీ ఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. ఆర్ అంబేద్కర్, గాంధీజీ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్ఓ టి. సీతారామమూర్తి తదితరులు పాల్గొన్నారు.