రాజమండ్రిలోని మల్లికార్జున నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సినీ, రాజకీయ రంగంలో రాణించి ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.