సాధారణంగా చౌడు నేలల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. జింకు లోపమున్న నేలల్లో మొక్కల పెరుగుదల క్షీణించి పాలిపోయి చనిపోతాయి. పెరుగుదల దశలో జింకు లోపముంటే ఆకులు చిన్నవిగా మారి సన్నబడి పైకి లేదా కిందకు ముడుచుకుపోతాయి. నివారణకు కాయలు కోసిన వెంటనే జూన్-జూలై మాసాల్లో 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్‌తో పాటు 10 గ్రాముల యూరియా మరియు 0.1 మి.లీ ట్రైటాన్ కలిపి పిచికారీ చేయాలి.