AP: మహిళా దినోత్సవం రోజున మహిళా వైద్యురాలు డా. శ్వేతను ప్రత్తిపాడు జనసేన ఇన్‌చార్జ్ వరుపుల తమ్మయ్యబాబు దూషించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యురాలిపై తమ్మయ్య తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. చట్టప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని, కాకినాడ జిల్లా ఇన్‌చార్జ్‌లకు పవన్ ఆదేశాలు జారీచేశారు.