డిసెంబర్ 5వ తేదీన జరగనున్న గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులకు కలెక్టర్ ప్రశాంతి సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై శనివారం రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల అధికారులతో రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో పలు సూచనలు చేశారు.