రాజమండ్రి రూరల్ మండలంలోని కాతేరులో మంగళవారం సాయంత్రం శ్రీ ధన్వంతరి స్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గోదావరి జోన్ ధర్మ ప్రచారక్ జగన్నాధరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆయుర్వేద వైద్యరంగంలో ధన్వంతరి స్వామి చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ బీజేపీ కో కన్వీనర్ యానాపు ఏసు తదితరులు పాల్గొన్నారు.