రాజమండ్రి రూరల్: క్రికెట్ పోటీలను ప్రారంభించిన గోరంట్ల

61చూసినవారు
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పుట్టినరోజు సందర్బంగా హుకుంపేటలో గోరంట్ల ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం నిర్వహించారు. ఈ పోటీలను ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, పెండ్యాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్