రాజమండ్రి: పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట

85చూసినవారు
రాజమండ్రి: పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట
పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రిలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. పేద ప్రజల ఆప్తుడు సీఎం చంద్రబాబు అని, అనారోగ్యాలతో వైద్య ఖర్చులు భారమై ఆర్థిక ఒడిదుడుకులు పడుతున్న కుటుంబాలకు చంద్రబాబు అండగా నిలుస్తున్నారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్