ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుండి ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని గార్డ్స్ ఫర్ ఆర్టిఐ జాతీయ కన్వీనర్ వరదా నాగేశ్వరరావు అన్నారు. శనివారం కడియం ఉన్నత పాఠశాలలో గాడ్స్ ఫర్ ఆర్టిఐ అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న నాగేశ్వరరావు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అనేది సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం వంటిదని, సామాన్యులు మొదలు పండితులు వరకు ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాలన్నారు.