ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో " మన ఇల్లు, మన గౌరవం" కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్, మండల ప్రత్యేక అధికారి, ఎంపిడిఓ, సహాయక ఇంజనీర్ (గృహ), మండల ప్రత్యేక అధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు లేఅవుట్లు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గ్రామ అభివృద్ధికి, నూతన ఇళ్ల నిర్మాణానికి కీలకమైన దశగా నిలుస్తోందని అన్నారు.