గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. ఆదివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా జగన్ పాలన అందించారని కొనియాడారు. నాడు - నేడు పథకం ద్వారా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు.