రాజానగరం మండలం పరిధిలోని చక్రద్వారబంధం గ్రామంలో కనకదుర్గమ్మ వారి జాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బలరామకృష్ణ, సతీమణి వెంకటలక్ష్మి పాల్గొని అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.