రాజానగరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైల్డ్ అండ్ అడాలసెంట్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ పీజీ డిప్లొమా కోర్సును అందరూ సద్వినియోగం చేసుకోవాలని వీసి ఆచార్య వై. శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం దీనికి సంబంధించిన బ్రోచర్‌ను వీసీ ఆవిష్కరించారు. ఏడాది కాల పరిమితితో 40 సీట్లతో అనుభవజ్ఞులైన అధ్యాపకుల నిర్వహణలో పీజీ డిప్లొమా కోర్సును నిర్వహిస్తున్నామన్నారు.