సీతానగరం మండల ప్రధాన కేంద్రమైన మూనికోడవలిలో నూతనంగా నిర్మించబోయే దుర్గాదేవి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి బత్తుల వెంకటలక్ష్మి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు తీర్థప్రసాదాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, కూటమి కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు.