రామచంద్రపురం ఆర్ఆర్ లాడ్జిపై పోలీసులు దాడి... పలువురు అరెస్ట్

4907చూసినవారు
రామచంద్రపురం ఆర్ఆర్ లాడ్జిపై పోలీసులు దాడి... పలువురు అరెస్ట్
రామచంద్రపురం మండలం చోడవరం బైపాస్ రోడ్డులోని ఆర్ ఆర్ గ్రాండ్ లాడ్జిలో వ్యభిచార ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీఐ దొరరాజు తెలిపిన వివరాలు లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని వచ్చిన సమాచారంతో ఎస్సై సురేష్ బాబు సిబ్బందితో కలిసి దాడులు చేపట్టారు. ఇద్దరు నిర్వాహకులు, ముగ్గురు విటులపై కేసు నమోదుచేసి, అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఇద్దరు మహిళలకు కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్