సమస్యలను గుర్తించడం, వాటిని పరిష్కరించటం మన గ్రామం- మన సుభాష్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని కాజులూరు మండలం మంజేరు గ్రామంలోశుక్రవారం మంత్రి సుభాష్ పర్యటించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన ఊరు- మన సుభాష్ అనే కార్యక్రమం ద్వారా స్థానిక సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయని అన్నారు.