దేవీపట్నం: ఎండలకు తగ్గిన పర్యాటకుల సంఖ్య

51చూసినవారు
ఎండలు విపరీతంగా ఉండటంతో పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటకులు ఎండలకు భయపడి రావడం లేదు. సోమవారం రెండు పర్యాటక బోట్లలో 42 మంది పర్యాటకులు మాత్రమే పాపికొండల విహారయాత్రకు వెళ్లినట్లు టూరిజం శాఖ అధికారి సాంబశివరావు తెలిపారు. ఒక బోటులో 30 మంది, మరొక బోటులో 12 మంది మాత్రమే వెళ్లారని తెలిపారు.

సంబంధిత పోస్ట్