అడ్డతీగల సీతపల్లి సెంటర్ వాసులకు చీకటిలోనే దీపావళి

1743చూసినవారు
అడ్డతీగల సీతపల్లి సెంటర్ వాసులకు చీకటిలోనే దీపావళి
అల్లూరి జిల్లా అడ్డతీగల గ్రామంలో స్థానిక అంబెడ్కర్ బొమ్మ వద్ద మహా వృక్షమును కూల్చే పని లో ఆర్ అండ్ బి అధికారులు నిమగ్నమయ్యారు. అటు వైపుగా వాహనాలు వెళ్లకుండా దారికి అడ్డువేయడం తో వాహనదారులు , బస్సు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. సోమవారం ఉదయం మొదలైన ఈ పనులు రాత్రి పది గంటల వరకు కొనసాగనున్నాయి. అటు విద్యుత్ లైన్ లను కట్ చేయడం తో సీతపల్లి సెంటర్ వాసులు పండగవేల ఉదయం నుండి తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఆ ప్రాంత నివాసులు , పిల్లలు చీకట్లోనే దీపావళి జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు ఇలాంటి పనులు చేసే ముందు ప్రణాళిక తో గ్రామస్థులు ఇబ్బందులు పడకుండా చూడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్