అల్లూరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఏ ఎస్ పి చింతూరు మరియు ఐటిడిఏ పిఓ సూచన మేరకు కోతుల గుట్ట ఏపిఆర్ రిహాబిడేషన్ సెంటర్ లో కృష్ణార్జున చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో కూనవరం పోలీస్ వారి ఆధ్వర్యంలో మంగళవారం వండిన ఆహారము అందరికీ పంపిణీ చేయడం జరిగింది. కూనవరం ఎస్ఐ మాట్లాడుతూ ప్రస్తుత వరదల సమయంలో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి వరద బాధితులకు టార్పాలిన్సు దోమతెరలు వంటి అత్యవసర వస్తువులు అందించాలని అన్నారు.