కూనవరం మండలంలోని టేకుబాక గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఏర్పాటుచేసిన మోటర్ రెండు నెలలుగా మరమ్మతులకు గురైంది. దీనితో వేసవి దృష్ట్యా. రెండు నెలలుగా గిరిజనులకు తాగునీటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆదివారం వాపోయారు. ఇప్పటికైనా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి టేకుబాకలో నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు.