రంపచోడవరం నియోజకవర్గంలో ప్రభుత్వ విద్యాలయాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ భోధన, బోధనేతర సిబ్బంది సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శిరీష దేవి హామీ ఇచ్చారు. 20ఏళ్ళ నుండి పని చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేదని తక్కువ జీతంతో పని చేస్తున్నామని టీచర్స్ ఆమె ద్రుష్టికి రంపచోడవరంలో తీసుకువచ్చారు. మంత్రి, అధికారులతో చర్చించి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.