రంపచోడవరం: వన్యప్రాణుల సంరక్షణ మనందరి బాధ్యత

78చూసినవారు
రంపచోడవరం: వన్యప్రాణుల సంరక్షణ మనందరి బాధ్యత
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతని కూనవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కరుణాకర్ అన్నారు. 69వ వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాల సందర్భంగా ఆయన స్థానిక దుర్గాదేవి ఆలయ ప్రాంగణములో ఆదివారం భక్తులకు వన్యప్రాణుల సంరక్షణ గురించి వివరించారు. రక్షిత అటవీప్రాంతంలో గల వివిధ వన్యప్రాణుల గురించి తెలియజేశారు. అనంతరం అటవీ సిబ్బందితో కలిసి ర్యాలీ చేపట్టారు.

సంబంధిత పోస్ట్