విద్యార్థులు అందరూ చదువుపై ద్రుష్టి సారించి ఉన్నంతంగా ఎదగాలని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషదేవి అన్నారు. రంపచోడవరం గురుకుల పాఠశాల, కళాశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ఆహారం, వైద్య సదుపాయాలు ఎలా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సమస్యలు ఉన్నా తనకు నేరుగా తెలియజేయాలన్నారు. చదువుతోపాటు క్రీడాల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండాలన్నారు.