రంపచోడవరం: రోగులకు నాణ్యమైన వైద్యం అందించండి

80చూసినవారు
రంపచోడవరం: రోగులకు నాణ్యమైన వైద్యం అందించండి
రంపచోడవరం ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే శిరీషదేవి బుధవారం తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యం పై ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే రోగులందరికీ వైద్య పరీక్షలు అన్ని ఉచితంగా చేసి నాణ్యమైన వైద్యం అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. చిన్నపాటి పరీక్షలకు, వైద్యానికి రాజమండ్రి జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారని స్థానికులు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. సిబ్బంది ఎల్లప్పుడు రోగులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్