రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని సీపీఎం పార్టీ రాజావొమ్మంగి మండల కార్యదర్శి సూరిబాబు డిమాండ్ చేశారు. అల్లూరి జిల్లా రంపచోడవరం మండలంలోని మంగళవారం జరిగిన జిల్లా మహాసభలో ఆయన మాట్లాడుతూ దేశంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు కాక అప్పులు చేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నారనిి వాపోయారు. రైతుల సమస్యపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలన్నారు.