రంపచోడవరంలో రోడ్డు ప్రమాదం

52చూసినవారు
రంపచోడవరం మండలంలోని నరసాపురం గ్రామ సమీపంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళ్తే రంపచోడవరం నుంచి గోకవరం వైపుకు వస్తున్న లారీ, గోకవరం నుంచి ఏజెన్సీ ప్రాంతానికి వెళుతున్న బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఆటోను తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్