రంపచోడవరంలో ఏపీ సంయుక్త కిసాన్ మోర్చా & ట్రేడ్ యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు రైతు కూలీ, ఏజెన్సీ గిరిజన సంఘం మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ వంజం జోగారావు, ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తాటి బుల్లబ్బాయి మాట్లాడారు. రైతాంగం, కార్మిక, వృత్తి సంఘాల వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.