ప్రమాదకర పరిస్థితిలో వాగు దాటుతున్న గ్రామస్తులు

66చూసినవారు
అడ్డతీగల మండలం పలుకురాతిపాలెం గ్రామస్తులు తమ గ్రామానికి వెళ్లడానికి వంతెన లేక ప్రాణాలను పణంగా పెట్టి వాగులు దాటుతున్నారు. గత 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దూరు వాగు పొంగి ప్రవహించడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో శనివారం అనారోగ్యంతో బాధపడుతున్న గ్రామానికి చెందిన ఓ మహిళ అడ్డతీగల ఆసుపత్రికి టైరుకు ట్యూబ్ సహాయంతో స్థానికులు వాగు దాటి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్