డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు మండల పరిధిలో మొత్తం 8 వైన్ షాపులకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 8 షాపులకు మొత్తం 64 దరఖాస్తులు అందాయని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. ఈ మండల పరిధిలో గడువు తేదీ ముగిసే సమయానికి మరిన్ని దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు.