సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఆలయానికి ఆదివారం సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. అదేవిధంగా భక్తులు నిత్య అన్నదానం పథకం ద్వారా అన్నప్రసాదాలను స్వీకరించారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. అంతర్వేది బీచ్ వద్ద పర్యాటకుల సందడి నెలకొంది.