ప్రభుత్వ నూతన మద్యం పాలసీను వ్యతిరేఖిస్తూ డా. బీ. ఆర్ అంబేద్కర్కోనసీమ జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల ఉద్యోగులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. జిల్లా పరిధిలోని ముమ్మిడివరం, మలికిపురం, అంబాజీపేట తదితర మండలాల్లో ప్రధాన రహదారులపై ఫ్లెక్సీలతో తమ నిరసనను తెలిపారు. తమకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.